Kanguva: గతం X వర్తమానం

గతంలో కత్తి పట్టిన యుద్ధ వీరుడిగా.. వర్తమానంలో గన్‌ చేతపట్టిన యోధుడిగా... సూర్య రెండు అవతారాల్లో సందడి చేయబోతున్నాడు.

Updated : 15 Apr 2024 12:05 IST

తంలో కత్తి పట్టిన యుద్ధ వీరుడిగా.. వర్తమానంలో గన్‌ చేతపట్టిన యోధుడిగా... సూర్య రెండు అవతారాల్లో సందడి చేయబోతున్నాడు. ఇదంతా ‘కంగువా’ చిత్రంలోనే. సూర్య కథానాయకుడిగా, శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. దిశా పటానీ కథానాయిక. యోగిబాబు, బాబీ దేవోల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ కలిసి నిర్మిస్తున్నారు. పది భాషల్లో త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం చిత్రబృందం కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. గతం, వర్తమానం తలపడితే కొత్త భవిష్యత్తు మొదలవుతుందనే సందేశంతో కూడిన ఈ పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్టు తెలిపింది చిత్రబృందం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని