Janhvi Kapoor: అలియా భట్‌ స్థానంలో జాన్వీ కపూర్‌.. క్లారిటీ ఇచ్చిన కరణ్‌ జోహార్‌

బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ఒక సీక్వెల్‌లో అలియా భట్‌ స్థానంలో జాన్వీ కపూర్‌ను ( Janhvi Kapoor) తీసుకోనున్నారంటూ జోరుగా ప్రచారం మొదలైంది. తాజాగా దీనిపై కరణ్‌ జోహార్‌ స్పందించారు.

Published : 06 Jan 2024 15:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుణ్‌ ధావన్‌-అలియా భట్‌ కలిసి నటించిన చిత్రం ‘దుల్హనియా’. రెండు భాగాలుగా ఇది అలరించింది. త్వరలోనే దీని మూడో పార్ట్ రానుందంటూ వార్తలు వస్తున్నాయి. అందులో అలియా భట్‌ (Alia Bhatt) స్థానంలో దర్శక నిర్మాతలు జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారని టాక్‌ వినిపిస్తోంది. దీనిపై నటుడు, దర్శకుడు కరణ్‌ జోహార్‌ స్పందించారు.

‘‘ప్రతి రోజు నిద్రలేవగానే ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక రూమర్‌ వినిపిస్తోంది. నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకుండా ఇలా ప్రచారమయ్యే వార్తలను నమ్మొద్దని అభిమానులను అభ్యర్థిస్తున్నాను. సరైన సమయం వచ్చినప్పుడు మేము దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తాం. ఈ చిత్రం సీక్వెల్‌ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు’’ అని తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఇటీవల.. కాఫీ విత్‌ కరణ్ ఎపిసోడ్‌లో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) సందడి చేసినప్పటి నుంచి ఈ రూమర్‌ మొదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని