Kartik Aaryan: మరోసారి ఇలా రీమేక్‌లు చేయను.. హీరో కార్తిక్‌ ఆర్యన్‌

తెలుగులో సూపర్‌ హిట్‌ చిత్రం ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) హిందీలో ‘షెహజాదా’ (Shehzada) పేరుతో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ రీమేక్‌ డిజాస్టర్‌ కావడం పై బాలీవుడ్‌ హీరో స్పందించారు.

Published : 06 Aug 2023 16:06 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo). ఈ చిత్రం తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ కథనే హిందీలో ‘షెహజాదా’ (Shehzada) పేరుతో రీమేక్‌ చేశారు. ఇక్కడ అల్లు అర్జున్‌ పోషించిన పాత్రను అక్కడ కార్తిక్‌ ఆర్యన్‌, పూజాహెగ్డే పాత్రలో కృతి ససన్‌ నటించారు. అయితే, తెలుగులో బ్లాక్‌బస్టర్‌ సాధించిన ఈ చిత్రం హిందీలో డిజాస్టర్‌గా నిలిచింది. దీనిపై కార్తిక్‌ ఆర్యన్‌ తాజాగా స్పందించారు.

ఓ ఇంటర్వ్యూలో కార్తిక్‌ ఆర్యన్‌ (Kartik Aaryan) ఈ సినిమా గురించి మాట్లాడుతూ .. ‘‘నేను చేసిన తొలి రీమేక్‌ ‘షెహజాదా’. ఈ సినిమా నాకు ఓ భిన్నమైన అనుభవాన్నిచ్చింది. ఇకపై ఎప్పుడూ రీమేక్‌ చిత్రాలు చేయకూడదని అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ప్రజలు ఆ చిత్రాన్ని మరో భాషలో చూసేసి ఉంటారు. మళ్లీ డబ్బులు ఖర్చు చేసి అదే సినిమాను చూడాలని వారు అనుకోరనే విషయం అర్థమైంది. ఎవరో చేసిన పనిని చేయడం నాకు ఇష్టం ఉండదు. సినిమా చిత్రీకరణ సమయంలో అనిపించకపోయినా.. షూటింగ్‌ పూర్తయ్యాక మరోసారి ఇలా చేయకూడదనిపించింది. రీమేక్‌ మూవీల వల్ల నాకు ఆనందం రాదని అర్థమైంది’’ అని పేర్కొన్నారు.

అదెంతో క్లిష్టమైన సమయం.. కన్నీటి పర్యంతమైన హీరోయిన్‌

ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘షెహజాదా’ చిత్రం బాలీవుడ్‌లో విడుదలైంది. తెలుగులో వచ్చిన కథలో ఎలాంటి మార్పులు లేకుండా హిందీలో రూపొందించడం వల్లే అలాంటి ఫలితం వచ్చిందని కామెంట్స్‌ వినిపించాయి. ఈ సినిమాను హిందీలో నిర్మించిన వారిలో అల్లు అరవింద్‌ కూడా ఉన్నారు. ఈ రీమేక్‌ సినిమా తర్వాత కార్తిక్‌ ఆర్యన్‌ ‘సత్యప్రేమ్‌ కీ కథ’ (Satyaprem Ki Katha)తో ప్రేక్షకుల ముందుకు విజయాన్ని అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని