Kartik Aaryan: ఆటోలో ప్రయాణం.. అవకాశాల్లేక కన్నీళ్లు పెట్టుకున్నా: బాలీవుడ్‌ నటుడు

సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కార్తిక్‌ ఆర్యన్‌ (Kartik Aaryan). 

Published : 11 Apr 2024 15:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కార్తిక్‌ ఆర్యన్‌ (Kartik Aaryan). ఇటీవల ‘సత్యప్రేమ్‌ కి కథ’తో ప్రేక్షకులను అలరించిన ఆయన ప్రస్తుతం ‘చందు ఛాంపియన్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు. తాజాగా ఆయన నేహా ధూపియా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నో ఫిల్టర్‌ విత్‌ నేహా’ కార్యక్రమంలో పాల్గొని కెరీర్‌లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, సవాళ్లపై స్పందించారు.

‘‘ఈ సినీ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. కెరీర్‌ ఆరంభంలో పలు యాడ్స్ కోసం వర్క్‌ చేశా. కొన్నిసార్లు కేవలం ప్లకార్డులు పట్టుకుని కెమెరా ముందు నిల్చొనేవాడిని. ఎన్నో ఆడిషన్స్‌లో పాల్గొన్నప్పటికీ ప్రయోజనం లేకుండాపోయేది. బాధగా అనిపించి ఏడ్చేసిన సందర్భాలూ ఉన్నాయి. ‘సోను కే టిటూ కీ స్వీటీ’ విడుదలకు ముందు నేనెవరో ఎవరికీ తెలియదు. నేను ఉన్నానని ఎవరూ గుర్తించలేదు. అవార్డుల ఫంక్షన్‌కు వెళ్లడానికి కారు ఉండేది కాదు. ఆటోలో వెళ్లేవాడిని. తొలుత నటించిన నాలుగు చిత్రాల వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. తర్వాత థర్డ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలు చేశా. నాకు కారులంటే ఇష్టం. నా వద్ద ఒక్క వెహికల్‌ కూడా లేనప్పుడే ఎట్లాగైనా చాలా కార్లు కొనాలని నిర్ణయించుకున్నా. అన్నిరకాల కార్లతో గ్యారేజ్‌ నింపాలనుకున్నా’’ అని ఆయన చెప్పారు.

1970లో జరిగిన కామన్‌ వెల్త్‌, 1972-జర్మనీలో జరిగిన పారా ఒలింపిక్‌ క్రీడల్లో గోల్డ్‌ మెడల్‌ని సాధించిన మురళీకాంత్‌ పేట్కర్‌ జీవితం ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకుంటోన్న చిత్రమిది. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. కబీర్‌ ఖాన్‌ దర్శకుడు. కార్తిక్‌కు జోడీగా శ్రద్ధాకపూర్‌ కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని