Avatar 2: ఆ రాష్ట్రంలో ‘అవతార్‌-2’ ప్రదర్శన రద్దు!

హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ ‘అవతార్‌’. ఇప్పుడిదే చిత్రానికి కొనసాగింపుగా ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ సిద్ధమైంది. ‘అవతార్‌-2’గా ఇది ప్రచారంలో ఉంది.  

Published : 30 Nov 2022 15:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘అవతార్‌-2’ (Avatar 2) వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ 16న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు జేమ్స్ కామెరూన్‌ బృందం సన్నాహాలు చేస్తోన్న వేళ.. కేరళలో ఈ సినిమా ప్రదర్శనకు చుక్కెదురైంది. ఆ రాష్ట్రంలోని సుమారు 400 థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోమంటూ ది ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ యునైటెడ్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కేరళ (ఎఫ్‌ఈయుఓకే) మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

లాభాలను పంచుకునే విషయంలో థియేటర్‌ యజమానులు, డిస్ట్రిబ్యూటర్స్‌ మధ్య ఏర్పడిన వివాదం కారణంగా ఎఫ్‌ఈయుఓకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటాల విషయంలో డిస్ట్రిబ్యూటర్స్‌ పెట్టిన షరతులను తాము అంగీకరించడం లేదని, అందుకే ఎఫ్‌ఈయుఓకే పరిధిలోని థియేటర్స్‌లో ‘అవతార్‌-2’ ప్రదర్శన రద్దు చేశామని, ఈ విషయంపై త్వరలోనే చర్చలు జరుగుతాయని తాము భావిస్తున్నామంటూ ఎఫ్‌ఈయుఓకే అధ్యక్షుడు విజయకుమార్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని