Kiara Advani: ప్రభాస్‌తో కియారా?

‘సలార్‌ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్‌లో లేదా జులైలో ప్రభాస్‌ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి.

Updated : 26 Apr 2024 11:44 IST

‘సలార్‌ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్‌లో లేదా జులైలో ప్రభాస్‌ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. రెండో భాగంలో మరికొన్ని అదనపు ఆకర్షణలు ఉంటాయని, అందులో భాగంగా మరో కథానాయికని ఎంపిక చేయడంపై చిత్రబృందం దృష్టి పెట్టినట్టు సమాచారం. తొలి భాగంలో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ నటించిన సంగతి తెలిసిందే. ‘సలార్‌ 2’లోనూ ఆమె పాత్ర కీలకం. అయితే  శ్రుతితోపాటు, కియారా అడ్వాణీ కూడా రెండో భాగంలో ఓ కీలక పాత్రని చేయనున్నారని తెలిసింది. సినిమాలో ప్రత్యేక గీతంలోనూ కియారా ఆడిపాడనున్నారనే కథనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో... హోంబలే ఫిలింస్‌ నిర్మిస్తున్న చిత్రమిది. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని