Kiara Advani: ‘సికందర్‌’తో కియారా?

గతేడాది ‘సత్యప్రేమ్‌ కీ కథా’ అనే ఒక్క సినిమాతో సరిపెట్టుకున్న బాలీవుడ్‌ భామ కియారా అడ్వాణీ..ఈ ఏడాది వరుస చిత్రాలతో జోరు చూపిస్తోంది. ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘వార్‌ 2’, ‘డాన్‌ 3’ లాంటి భారీ యాక్షన్‌ సినిమాలతో బిజీగా గడుపుతున్న ఈమె మరో చిత్రం కోసం రంగం సిద్ధం చేసుకుందని అంటున్నాయి చిత్రవర్గాలు.

Updated : 21 Apr 2024 13:34 IST

తేడాది ‘సత్యప్రేమ్‌ కీ కథా’ అనే ఒక్క సినిమాతో సరిపెట్టుకున్న బాలీవుడ్‌ భామ కియారా అడ్వాణీ..ఈ ఏడాది వరుస చిత్రాలతో జోరు చూపిస్తోంది. ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘వార్‌ 2’, ‘డాన్‌ 3’ లాంటి భారీ యాక్షన్‌ సినిమాలతో బిజీగా గడుపుతున్న ఈమె మరో చిత్రం కోసం రంగం సిద్ధం చేసుకుందని అంటున్నాయి చిత్రవర్గాలు. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తమిళ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సికందర్‌’. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్‌కి జోడీగా కియారా ఎంపికైనట్లు సమాచారం. ఈమెతో నిర్మాత సాజిద్‌ చిత్ర విషయాల్ని చర్చిôచినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మే మొదటి వారం నుంచి షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుందని తెలుస్తోంది. భావోద్వేగాలతో కూడిన యాక్షన్‌ చిత్రమిదని, సామాజిక అంశం కూడా ఉంటుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురుగదాస్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఈద్‌కి ‘సికందర్‌’ సందడి చేయనున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని