Kichcha Sudeep: అందుకే ఆ సినిమా తర్వాత కొంచెం బ్రేక్‌ తీసుకున్నా: కిచ్చా సుదీప్‌

ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్‌ (Kichcha Sudeep) ‘విక్రాంత్‌ రోణ’ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. తాజాగా ఆయన మూడు సినిమాలకు సైన్‌ చేసినట్లు ప్రకటించాడు.

Published : 02 Apr 2023 15:54 IST

హైదరాబాద్‌: స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌కు అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. ఇక తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈగ’ సినిమాలో విలన్‌గా  ఇక్కడ కూడా ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ హీరో తన తర్వాత ప్రాజెక్ట్‌ల గురించి ట్విటలో పోస్ట్‌ పెట్టాడు. కొన్ని రోజులు విరామం తీసుకున్నట్లు తెలిపాడు. త్వరలోనే కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించాడు.

సినిమాల్లోకి వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి విరామం తీసుకున్నట్లు కిచ్చా సుదీప్‌ తెలిపాడు.  ‘‘విక్రాంత్‌ రోణ’ (Vikrant Rona)సినిమా షూటింగ్‌ సమయంలో నాకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరం అనుకున్నా. ఆ సినిమాను కొవిడ్‌ సమయంలో షూట్‌ చేశారు. దానితో పాటు మరోవైపు ‘బిగ్‌బాస్‌’ సుదీర్ఘమైన షెడ్యూల్‌లోనూ పాల్గొన్నాను. అందుకే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నా. ఈ విరామ సమయంలో నాకెంతో ఇష్టమైన క్రికెట్‌ను చూస్తూ.. ఆడుతూ ఎంజాయ్‌ చేశా. మీరందరూ నా నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ గురించి అడుగుతూ చేసిన ట్వీట్లు, మీమ్స్‌ చూశాను. ప్రస్తుతం మూడు స్క్రిప్ట్‌లు ఫైనల్‌ చేశా.  వాటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఆ టీమ్‌ వాళ్లు రాత్రి..పగలు తేడా లేకుండా పని చేస్తున్నారు. ఆ మూడు సినిమాలు భారీ బడ్జెట్‌వి అవ్వడంతో వాటికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ కూడా అంతే భారీగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాల గురించి వివరాలు ప్రకటిస్తాను’’ అన్నారు. ఇక గతేడాది కిచ్చా సుదీప్‌ (Kichcha Sudeep) భారీ యాక్షన్‌ చిత్రం విక్రాంత్‌ రోణతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని