Meter: ఏ నమ్మకంతో ఇండస్ట్రీకి వచ్చానో తెలీదు..: కిరణ్ అబ్బవరం
యంగ్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన ‘మీటర్’ (Meter) సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి వరస సినిమాలతో అలరిస్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). తాజాగా రమేష్ కడూరి దర్శకత్వంలో ఆయన నటించిన సినిమా ‘మీటర్’ (Meter). ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మీడియాతో ముచ్చటించారు. అభిమానులతో కలిసి సందడి చేశారు.
ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘‘మీటర్’ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గదు. థియేటర్లో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. నేను జాబ్ మానేసి సినిమాల్లోకి ఏ నమ్మకంతో వచ్చానో తెలీదు. ఇప్పటికీ కలలా ఉంది. నా నమ్మకాన్ని మీరంతా నిజం చేశారు. 5 సంవత్సరాలు చాలా వేగంగా గడిచాయి. ఇది నా ఏడో సినిమా. ఒకవైపు సినిమాలు మరోవైపు షార్ట్ ఫిల్మ్‌లు చేస్తున్నాను. నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా మొదటి సినిమా ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru) సమయంలో నేను మైక్ పట్టుకుని ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి సినిమా ఎలా ఉందని అడిగాను.. ఆరోజులు ఇంకా గుర్తున్నాయి.
అభిమానులందరూ ‘కొంచెమైనా రెస్ట్ తీసుకో’అంటున్నారు. నాకు సినిమా అంటే పిచ్చి. అందుకే ఎప్పుడూ సినిమాకు సంబంధించిన పనుల్లోనే మునిగిపోతాను. ఈ 5 ఏళ్లలో చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటాను. మళ్లీ ఈ ఏడాదిలోనే ఓ పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌తో మీ ముందుకు వస్తాను. సినిమాలు చెయ్యడం చాలా కష్టమైన పని.. అందులోనూ ‘మీటర్’ లాంటి కమర్షియల్ సినిమా చెయ్యాలంటే ఇంకా కష్టం. ఇంత పెద్ద సినిమాను కూడా తక్కువ టైంలో పూర్తి చెయ్యగలిగామంటే దాని వెనక టీం అందరి శ్రమ ఉంది. ఈ సినిమా నాకు ప్రత్యేకమైనది. ఉత్సాహం కలగలిసిన సినిమానే ఈ మీటర్. నా శక్తి మేరకు సంవత్సరానికి రెండు సినిమాలు చెయ్యగలిగాను. అంతకంటే ఎక్కువ సినిమాలు చెయ్యగలిగితే ఇంకా సంతోషిస్తా. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అని కోరారు.
మీరు అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగిందా? ఇకపై అన్నీ మాస్ సినిమాలే చేస్తారా?
కిరణ్: బడ్జెట్ బాగా అయ్యింది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఇది ఓ పెద్ద హీరో కోసం రాసుకున్న కథ. సినిమా చాలా సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. నేను అన్ని రకాల సినిమాలు చేస్తాను. వ్యక్తిగతంగా నాకు కమర్షియల్ సినిమాలు అంటే ఇష్టం. ప్రతి ఒక్కరూ కుటుంబసమేతంగా కూర్చొని చూడగలిగే సినిమాలే తీస్తాను.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ వస్తారని టాక్ వినిపిస్తోంది.. నిజమైనా?
కిరణ్: ఈ విషయం రెండు రోజుల్లో చెబుతాను.
అగ్ర దర్శకులతో సినిమాలు ఎందుకు చెయ్యట్లేదు?
కిరణ్: నేను ఇంతకు మందు కూడా చాలా సార్లు చెప్పాను. నాకు అవకాశం చాలా కష్టంగా వచ్చింది. అందుకే నేను కొత్త వాళ్లతో సినిమాలు తీయడానికి ఇష్టపడతాను. నా సినిమా ‘వినరో భాగ్యము విష్ణకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) థియేటర్లో బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఓటీటీలోనూ సూపర్ హిట్ అయింది. బాలకృష్ణ గారి షోకు ఎంత క్రేజ్ వచ్చిందో ఈ సినిమాకూ అంతే క్రేజ్ వచ్చిందన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన