Kirara Advani: కియారా యాక్షన్‌ మొదలు

సినిమాల్లో అందం, అభినయంతో సినీప్రియుల హృదయాల్ని గెలుచుకునే మన అందాల తారలు.. ప్రస్తుతం యాక్షన్‌ చిత్రాల బాట పడుతున్నారు.

Updated : 13 Apr 2024 11:47 IST

సినిమాల్లో అందం, అభినయంతో సినీప్రియుల హృదయాల్ని గెలుచుకునే మన అందాల తారలు.. ప్రస్తుతం యాక్షన్‌ చిత్రాల బాట పడుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న బాలీవుడ్‌ భామ కియారా అడ్వాణీ త్వరలో ‘వార్‌ 2’లో తన యాక్షన్‌తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. ఇటీవలే ఈ సినిమా సెట్లోకి అడుగు పెట్టారు ఎన్టీఆర్‌. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో మే 1 నుంచి కియారా పాల్గొనున్నట్లు తెలుస్తుంది. ఆమె ఇందులోని తన పాత్రకు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాల కోసం ప్రత్యేక కసరత్తులు కూడా ప్రారంభించినట్లు సమాచారం. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. ప్రస్తుతం ‘డాన్‌ 3’, ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాల్లో నటిస్తోంది కియారా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని