Kiara Advani: డ్యాన్స్‌ చేయమంటే నవ్వులు పంచిన కియారా: ఈ డ్రెస్సులో చేయలేనంటూ!

డ్యాన్స్‌ చేయమని అడిగితే ‘ఈ డ్రెస్సులో ఇంతకంటే ఎక్కువగా చేయలేను’ అంటూ హీరోయిన్‌ కియారా అడ్వాణీ నవ్వులు పూయించారు. ఎక్కడంటే?

Published : 04 Dec 2023 18:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాల కోసం ముందుగా ప్రిపేర్‌ అవుతారు కాబట్టి ఆయా నటీనటులు సెట్స్‌లో బాగా డ్యాన్స్‌ చేయగలుగుతారు. మరి, అతిథిగా హాజరైన కార్యక్రమంలో అప్పటికప్పుడు స్టెప్పులు వేయాల్సి వస్తే కాస్త ఇబ్బందిగా ఫీలవుతారు. అందుకు వారు ధరించిన దుస్తులూ ఓ కారణమే! బాలీవుడ్‌ హీరోయిన్‌ కియారా అడ్వాణీకి (Kiara Advani) ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ (Karan Johar) హోస్ట్‌గా ‘కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 8’ (koffee with karan season 8) ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఎపిసోడ్‌కు కియారా, విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) అతిథులుగా హాజరయ్యారు. డిసెంబరు 7న స్ట్రీమింగ్‌ కానున్న (ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌) ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. కరణ్‌తో కలిసి కియారా, విక్కీ ఎంత సందడి చేశారో అందులో చూడొచ్చు. ఈ గెస్ట్‌ల నుంచి వ్యక్తిగత వివరాలు, వృత్తిపరమైన విశేషాలను రాబట్టిన కరణ్‌ వారిద్దరిని డ్యాన్స్‌ కూడా చేయమని అడిగారు. ఈ క్రమంలోనే కొన్ని స్టెప్పులు వేసిన కియారా.. ‘ఈ డ్రెస్సులో ఇంతకంటే ఎక్కువగా డ్యాన్స్‌ చేయలేను’ అంటూ మధ్యలో నవ్వులు పూయించారు. బ్లాక్‌ కలర్‌ స్టైలిష్‌ డ్రెస్సులో ఆమె హాజరయ్యారు. సీజన్‌ 7లోనూ కియారా పాల్గొని ప్రేక్షకులకు వినోదం పంచారు.

‘యానిమల్‌’ మూవీపై రాంగోపాల్‌వర్మ రివ్యూ.. నాలుగున్నర గంటలున్నా తక్కువే!

సినిమాల విషయానికొస్తే.. కియారా, విక్కీ కలిసి ‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘గోవిందా నామ్‌ మేరా’లో నటించారు. ‘భరత్‌ అనే నేను’ (మహేశ్‌ బాబు)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కియారా ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ (రామ్‌ చరణ్‌)లో కనిపించారు. ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’తో (Game Changer) బిజీగా ఉన్నారు. రామ్‌ చరణ్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని