krithi shetty: టీజర్‌ వచ్చేది ఆ రోజే?

‘ఉప్పెన’లా తెలుగు సినీ ప్రేక్షకుల ప్రేమను పొందింది కథానాయిక కృతి శెట్టి. ‘సూపర్‌ 30’తో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన ఈ భామ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రాణిస్తూ మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంటోంది

Updated : 02 Apr 2024 09:40 IST

‘ఉప్పెన’లా తెలుగు సినీ ప్రేక్షకుల ప్రేమను పొందింది కథానాయిక కృతి శెట్టి. ‘సూపర్‌ 30’తో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన ఈ భామ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రాణిస్తూ మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం ఈమె..నటుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఎల్‌ఐసీ’(లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌). ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ‘ఇటీవలే సింగపూర్‌లో ఓ షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది చిత్రబృందం. ఆ రోజు తమిళ నూతన సంవత్సరం కాబట్టి అదే రోజు టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం ఆసక్తి కనబరుస్తోంది’ అంటూ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో ప్రదీప్‌కి సోదరిగా నయనతారని ఎంపిక చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చిత్ర టైటిల్‌ విషయంలోనూ కొన్ని వివాదాలు తలెత్తాయి. ‘మనమే’, ‘జీనీ’ సినిమాలతో బిజీగా ఉంది కృతి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని