Kriti Sanan: జీవితంలోని గొప్ప క్షణాలివి..

అనుకోకుండా చిత్రపరిశ్రమకు వచ్చానని చెప్తూ.. ఇప్పుడు హీరోలకు దీటుగా యాక్షన్‌ సన్నివేశాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది బాలీవుడ్‌ కథానాయిక కృతిసనన్‌.

Published : 24 May 2024 01:22 IST

నుకోకుండా చిత్రపరిశ్రమకు వచ్చానని చెప్తూ.. ఇప్పుడు హీరోలకు దీటుగా యాక్షన్‌ సన్నివేశాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది బాలీవుడ్‌ కథానాయిక కృతిసనన్‌. ‘హీరోపంటీ’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ... తన నటనకు గానూ గతేడాది ఉత్తమ నటిగా అంతర్జాతీయ అవార్డును దక్కించుకున్న ఈమె.. బాలీవుడ్‌లోకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకుంటూ.. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేసింది కృతి. ‘‘నేను హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి ఈ రోజుతో 10ఏళ్లు. నా జీవితంలో ఇప్పటి వరకు నేను చూడని అద్భుతమైన క్షణాలివి. మొదటిసారి సినిమా సెట్‌పైకి అడుగుపెట్టినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో... ఇప్పటికీ మళ్లీ కొత్తగానే అనిపిస్తుంటుంది. ఇన్నేళ్ల నా ప్రయాణంలో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఒక వ్యక్తిగా, నటుడిగా ఎదుగుతూ మంచి స్థాయిలో ఉన్నాను. ఎంతో మంది గొప్ప స్నేహితులను కలిశాను. నన్ను ఎప్పటికీ నవ్వించే జ్ఞాపకాలను పోగుచేసుకున్నాను. నా ప్రయాణంలో భాగమై.. నన్ను నమ్మి నాపై అభిమానాన్ని చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. భిన్నమైన కథనాలతో మిమ్మల్ని మరింత అలరించడానికి ప్రయత్నిస్తాన’’ని చెప్పుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని