Kriti Sanon: ఆ హీరోతో నా తొలి సినిమా.. పగటి కలగానే మిగిలిపోయింది: కృతి సనన్‌

తన మొదటి సినిమా సల్మాన్‌తో నటించాలని కలలు కన్నట్లు కృతి సనన్‌ చెప్పారు.

Published : 29 Mar 2024 18:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో బిజీగా మారారు నటి కృతిసనన్‌ (Kritisanon). ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘నేను పెద్ద కలలు కంటాను. వాటికి హద్దులుండవు. చిత్ర పరిశ్రమకు రాకముందే.. సల్మాన్‌తో నా మొదటి సినిమా చేయాలనుకున్నా. అది పగటి కలగానే మిగిలిపోయింది. ఇండస్ట్రీలో ఎంతోమందిని చూసి స్ఫూర్తి పొందుతుంటా. వారిలో షారుక్ ఖాన్‌ ఒకరు. ఆయన కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. రాజకీయాల్లోకి వెళ్తారా అని నన్ను చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. నాకు పాలిటిక్స్‌ గురించి పెద్దగా అవగాహన లేదు. ఒకవేళ కాలంతో పాటు నా ఆలోచనలో మార్పు వచ్చి ఆ సమయంలో రాజకీయాల్లోకి రావాలని నా మనసుకు అనిపిస్తే చెప్పలేను’ అని అన్నారు.

ఆమె నటించిన తాజా చిత్రం ‘ది క్రూ’. కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో టబూ, కరీనా కపూర్‌లతో కలిసి కృతి నటించారు. వాళ్లతో పనిచేసిన అనుభవాన్ని తాజాగా ఆమె పంచుకున్నారు. ‘అలాంటి పెద్ద యాక్టర్స్‌తో పనిచేయడం చాలా రిఫ్రెష్‌గా అనిపించింది. వాళ్ల టాలెంట్‌కు ఆశ్చర్యపోయాను. ఎన్నోఏళ్లుగా వాళ్ల గురించి వింటూ వచ్చాను. ఈ చిత్ర షూటింగ్‌ సమయంలో వాళ్ల ప్రతిభను ప్రత్యక్షంగా చూశా. ఇందులోని డైలాగులు, మా ముగ్గురి పాత్రల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్నాయి’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని