Prabhas: కల్కి విడుదల ఎప్పుడు?

ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల ఎప్పుడనే విషయంపై కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాల్లో పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

Updated : 11 Apr 2024 11:52 IST

ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల ఎప్పుడనే విషయంపై కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాల్లో పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. వీటికి తెరదించాలని నిర్ణయించింది చిత్రబృందం. ఈ నెల 17న కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్టు తెలిపింది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. మొదట ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయాలనుకున్నారు. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని విడుదల తేదీని వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు కొన్నాళ్లుగా చిత్రసీమలో వినిపిస్తోంది. మరి కొత్త విడుదల తేదీ ఎప్పుడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మే నెలలోనే మరో తేదీన విడుదల చేస్తారా లేక జూన్‌లోనా అనేది ఈ 17న స్పష్టత రానుంది. సైన్స్‌ ఫిక్షన్‌ కథతో, పురాణాల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది.

వచ్చే ఏడాదిలో... ‘సలార్‌ 2’

‘కల్కి 2898 ఎ.డి’ తర్వాత ప్రభాస్‌... ‘సలార్‌2’పై దృష్టి పెట్టనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. మే నెల నుంచే చిత్రీకరణ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తుండగా, విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని