Devara: హైదరాబాద్‌కు దేవర

దీపావళి సందర్భంగా ఓ చిన్న విరామం తీసుకున్న ‘దేవర’ బృందం మళ్లీ రంగంలోకి దిగింది. మంగళవారం నుంచి హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

Updated : 15 Nov 2023 13:14 IST

దీపావళి సందర్భంగా ఓ చిన్న విరామం తీసుకున్న ‘దేవర’ బృందం మళ్లీ రంగంలోకి దిగింది. మంగళవారం నుంచి హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌తోపాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటోంది.  ఎన్టీఆర్‌ కథానాయకుడిగా... కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. జాన్వీ కపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థ సమర్పిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే గోవాలో ఎన్టీఆర్‌, జాన్వీతోపాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో ప్రస్తుతం చిత్రీకరణని జరుపుతున్నారు.  సముద్రతీరం నేపథ్యంలో.. భయం అనే అంశం ప్రధానంగా సాగే చిత్రమిది. అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు ఛాయాగ్రాహకుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని