Lokesh Kanagaraj: రాఘవ లారెన్స్‌-లోకేశ్‌ కనగరాజ్ల ‘బెంజ్‌’

‘ఖైదీ’, ‘విక్రమ్‌’ లాంటి సినిమాలతో బాక్సాఫీసు వద్ద ట్రెండ్‌ సెట్‌ చేసిన దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌.

Updated : 15 Apr 2024 12:03 IST

‘ఖైదీ’, ‘విక్రమ్‌’ లాంటి సినిమాలతో బాక్సాఫీసు వద్ద ట్రెండ్‌ సెట్‌ చేసిన దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. ఇప్పుడాయన తమిళ నూతన సంవత్సరం సందర్భంగా కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. రాఘవ లారెన్స్‌ కథానాయకుడిగా ‘బెంజ్‌’ అనే చిత్రాన్ని ప్రకటించారు. దీనికి లోకేశ్‌ కథను అందిస్తున్నారు. ‘రెమో’ ఫేమ్‌ భాగ్యరాజ్‌ కన్నన్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆదివారం ఈ విషయాన్ని తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు లోకేశ్‌. ‘‘బెంజ్‌’ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలనేది ఎప్పటినుంచో ఉన్న కోరిక. నాకెంతో ఇష్టమైన రాఘవ లారెన్స్‌తో ఈ ప్రాజెక్టు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా ప్రయాణానికి మీ ఆశీసులు ఉంటాయని కోరుకుంటున్నాన’’ని వ్యాఖ్యల్ని జోడించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో దీన్ని రూపొందిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాల్ని వెల్లడించనున్నట్లు తెలిపింది చిత్రబృందం.

మరో చిత్రం ‘హంటర్‌’..

మరోవైపు వెంకట్‌మోహన్‌ దర్శకత్వంలో తన 25వ చిత్రం ‘హంటర్‌’ను ప్రకటించారు రాఘవ లారెన్స్‌. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఎక్స్‌ వేదికగా పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతున్నారు రాఘవ. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని