lokesh kanagaraj: ‘తలైవా171’ అప్‌డేట్‌ ఇచ్చిన దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌

లోకేశ్‌ కనగరాజ్‌ రజనీకాంత్‌తో చేయబోయే సినిమా అప్‌డేట్‌ ఇచ్చారు.

Published : 25 Mar 2024 20:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (lokesh kanagaraj) ‘ఇనిమేల్‌’ మ్యూజిక్‌ ఆల్బమ్‌తో నటుడిగా పరిచయమయ్యారు. ఇందులో శృతిహాసన్‌ పాటను ఆలపించడంతో పాటు నటించారు. ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్‌ లిరిక్స్‌ అందించారు. ఈ పాట మార్చి 25న విడుదలైంది. ఈ క్రమంలో లోకేశ్‌ కనగరాజ్‌ మీడియాతో మాట్లాడుతూ రజనీకాంత్‌తో తాను చేయబోయే సినిమా గురించి తెలిపారు. ‘‘రజనీకాంత్‌తో కలసి వర్క్‌ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ‘తలైవా171’ (Thalaivar 171) నాకెంతో ప్రత్యేకమైనది. షూటింగ్‌ మొదలుపెట్టడానికి, ప్రీప్రొడక్షన్ వర్క్‌ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. సంవత్సరంన్నరలో ఈ సినిమా పూర్తి చేసి, ఆ తర్వాత నెల రోజులకు కార్తి ‘ఖైదీ-2’ మొదలుపెడతాను. ప్రస్తుతం రజనీకాంత్‌ నటిస్తోన్న చిత్రం విడుదల తర్వాత దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడిస్తాను’’ అని  కనగరాజ్‌ పేర్కొన్నారు. ‘తలైవా 171’ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించనున్నారు. ఇందులో శివకార్తికేయన్‌ కీలక పాత్రలో నటించనున్నారు.

రజనీకాంత్‌(Rajinikanth) టి.జి.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ‘వెట్టయాన్‌’ తెలుగులో ‘వేటగాడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికాసింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు