Mahaveerudu: చిన్న రజనీకాంత్‌లా కనిపిస్తారు!

ఫాంటసీ కథతో రూపొందిన ‘మహావీరుడు’ సరికొత్త అనుభూతిని పంచుతుందని... తన గత చిత్రాల్లాగే ఈ సినిమా కూడా తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్నారు శివ కార్తికేయన్‌.

Updated : 10 Jul 2023 14:09 IST

ఫాంటసీ కథతో రూపొందిన ‘మహావీరుడు’ (mahaveerudu) సరికొత్త అనుభూతిని పంచుతుందని... తన గత చిత్రాల్లాగే ఈ సినిమా కూడా తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్నారు శివ కార్తికేయన్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మహావీరుడు’. అదితి శంకర్‌ కథానాయిక. మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏషియన్‌ సినిమాస్‌ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఈనెల 14న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. కథానాయకుడు అడివి శేష్‌, దర్శకుడు శేఖర్‌ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకని ఉద్దేశించి శివకార్తికేయన్‌ మాట్లాడుతూ ‘‘శేఖర్‌ కమ్ముల ఈ వేడుకకి రావడం ఆనందంగా ఉంది. అడివి శేష్‌ నాకు సోదరుడితో సమానం. కథ కుదిరితే ఆయనతో కలిసి తప్పకుండా నటిస్తా. ‘మహావీరుడు’ అందరికీ వినోదం పంచుతుంది’’ అన్నారు. శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘‘ప్రేమకథల్లో ‘మరోచరిత్ర’ అంటే ఎంతో ఇష్టం. అందులో నటించిన సరితతో కలిసి ఈ వేదికని పంచుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘కథ విన్నాక నో చెప్పాలనిపించలేదు. శివ కార్తికేయన్‌ అద్భుతంగా నటించారు. ఆయన చిన్న రజనీకాంత్‌లా కనిపిస్తుంటారు’’ అన్నారు నటి సరిత. ఈ కార్యక్రమంలో అదితి శంకర్‌, అనుదీప్‌, సునీల్‌ నారంగ్‌, జాన్వి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని