SSMB29: మరో ‘బాహుబలి’లా.. మహేశ్-రాజమౌళిల సినిమా..!
రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్‌డేట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది.
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) ఓ సినిమా (SSMB29) తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అటు అభిమానులు కూడా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ వార్త ఇండస్ట్రీలో వైరలవుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) ఈ సినిమా అప్‌డేట్‌ను బాలీవుడ్ మీడియాతో పంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అటు మహేశ్ కూడా రాజమౌళి సినిమా కోసం ఆసక్తిగా ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేశ్ 4 సంవత్సరాలు జక్కన సినిమా కోసం కేటాయించనున్నట్లు చెబుతున్నారు. తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ మీడియాతో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది ఓ అడ్వెంచర్ స్టోరీ అని.. వచ్చే ఏడాదిలో షూటింగ్ ప్రారంభం కానుందని చెప్పారు. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు సమాచారం. సీక్వెల్‌లో కథ మారుతుందని ప్రధాన పాత్రలు అలాగే ఉంటాయని ఆయన చెప్పినట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.
ఇక ఇప్పటికే పలు సినిమాలు రెండు భాగాలుగా విడుదలై ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి’(Bahubali), ‘కేజీఎఫ్’(KGF) సినిమాలు రెండు పార్టులుగా తెరకెక్కి బ్లాక్ బాస్టర్ హిట్‌లుగా నిలిచాయి. మరోవైపు అల్లుఅర్జున్ నటించిన ‘పుష్ప’ (Pushpa) సినిమా సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది. ఇక మహేశ్ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తే సూపర్ హిట్ సాధించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Property: ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి
-
India News
మహిళలకు ప్రతీనెలా రూ.వెయ్యి పంపిణీ
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)