Mahesh Babu: గౌతమ్‌ గ్రాడ్యుయేషన్‌ డే.. తండ్రిగా గర్వపడుతున్నా..: మహేశ్‌బాబు

Mahesh babu: తనయుడు గౌతమ్‌ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో మహేశ్‌బాబు, ఆయన కుటుంబం పాల్గొంది.

Updated : 27 May 2024 11:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన కుమారుడు గౌతమ్‌ను చూసి గర్వపడుతున్నట్లు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు (Mahesh babu) అన్నారు. తాజాగా జరిగిన గ్రాడ్యుయేషన్‌ డేలో మహేశ్‌ కుటుంబం పాల్గొంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను మహేశ్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

‘గర్వంతో నా హృదయం ఉప్పొంగుతోంది. గౌతమ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినందుకు నీకు అభినందనలు.  ఇక తర్వాతి అధ్యాయం ఎలా రాయాలో నీ చేతుల్లోనే ఉంది. మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావని నాకు తెలుసు. నీ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం సాధన చేస్తూ ఉండు. గుర్తు పెట్టుకో నువ్వు ఎప్పటికీ నాకు ప్రియమైన వాడివే. ఒక తండ్రిగా ఈ రోజు నేను ఎంతో గర్వపడుతున్నా’’ అని పేర్కొన్నారు. మహేశ్‌బాబు పెట్టిన పోస్ట్‌కు ఆయన సతీమణి, గౌతమ్ తల్లి నమ్రత శిరోద్కర్‌ స్పందిస్తూ ‘మాటలు రావటం లేదు. కేవలం ప్రేమ మాత్రమే..’ అంటూ లవ్‌ సింబల్‌ ఎమోజీలతో రిప్లై ఇచ్చారు.  మరోవైపు గౌతమ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన సందర్భంగా మహేశ్‌ అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు, ఈ సందర్భంగా దిగిన ఫొటోల్లో మహేశ్‌ను చూసి రాజమౌళి సినిమా గురించి అడుగుతూ కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న తన తదుపరి చిత్రం కోసం మహేశ్‌బాబు సిద్ధమవుతున్నారు. గౌతమ్‌ స్కూల్‌ ఈవెంట్‌లో పాల్గొన్న మహేశ్‌బాబు పొడవాటి జుట్టు, గడ్డంతో  కనిపించారు. దీంతో ఆయన అభిమానులు ఆ ఫొటోలను తమ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. యాక్షన్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని