SSMB 29: మహేశ్‌బాబు-రాజమౌళి మూవీ.. వైరల్‌గా మారిన వీడియో

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్‌బాబు (Mahesh babu) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది.

Updated : 19 Apr 2024 11:40 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపొందనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే చిత్ర బృందం కొన్నిరోజుల క్రితం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని తాజాగా వీరందరూ హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మహేశ్‌బాబు-రాజమౌళిని ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పొడవాటి జుట్టు, గడ్డంతో మహేశ్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించారు. లుక్‌ టెస్ట్‌లో భాగంగానే ఈ చిత్ర బృందం దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం.

భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘మహారాజ్‌’ (Maharaj) అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాక్‌. వెండితెరపై సరికొత్త లుక్‌లో మహేశ్‌ కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు. మహేశ్‌కు సంబంధించి మొత్తం ఎనిమిది లుక్స్‌ను జక్కన్న టీమ్‌ రెడీ చేసినట్లు టాక్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని