Mahesh Babu: పనులు చకచకా

మహేష్‌బాబు సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఈ ప్రశ్నకి సమాధానం దర్శకుడు రాజమౌళికి మాత్రమే తెలుసు. నిర్మాతల సమాధానం కూడా అదే. ఎప్పుడు, ఎలా మొదలు పెడతారు?

Updated : 21 Apr 2024 13:29 IST

హేష్‌బాబు సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఈ ప్రశ్నకి సమాధానం దర్శకుడు రాజమౌళికి మాత్రమే తెలుసు. నిర్మాతల సమాధానం కూడా అదే. ఎప్పుడు, ఎలా మొదలు పెడతారు?  తారాగణం, సాంకేతిక బృందం మాటేమిటి? ఇతర ప్రత్యేకతలేమిటి? అనే విషయాలు వెలుగులోకి రాకపోయినా...  మహేశ్‌బాబు - రాజమౌళి మాత్రం పూర్తిగా  ఆ సినిమా పనులతో బిజీ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా పనుల కోసం దుబాయ్‌ వెళ్లొచ్చారు. ఈ సందర్భంగా బయటికొచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది. మహేశ్‌బాబు పొడవాటి జుట్టు, గడ్డంతో లుక్‌ మార్చినట్టు తెలుస్తోంది. సినిమాలోనూ ఆయన అదే తరహా లుక్‌తో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ సినిమా పూర్వ నిర్మాణ పనుల్లో వేగం పెరిగినట్టు తెలుస్తోంది. ప్రపంచాన్ని చుట్టే  ఓ సాహసోపేతమైన ప్రయాణ గాథతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ వేసవిలోనే చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని