Mahesh babu: వైరలవుతోన్న మహేశ్‌ స్టైలిష్‌ లుక్‌.. ట్రెండింగ్‌లోకి SSMB 29

మహేశ్‌ బాబు తాజాగా కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వాటిలో ఆయన లుక్స్ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

Published : 02 Apr 2024 12:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల్లో స్టార్‌ హీరో మహేశ్‌ బాబు (Maheshbabu) ఒకరు. తాజాగా ఆయన షేర్‌ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవలే ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం తదుపరి సినిమా షూట్‌ కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టైలిష్‌ లుక్‌లో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూసిన ఫ్యాన్స్‌ రాజమౌళి సినిమా కోసమేనా ఈ లుక్‌ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. దీంతో SSMB 29 హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

మరోవైపు మహేశ్‌-రాజమౌళి ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో వార్త కూడా షేర్‌ అవుతోంది. దీనికి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ‘నాకు, రాజమౌళికి దక్షిణాఫ్రికా రచయిత విల్బర్‌ స్మిత్‌ నవలలు చాలా ఇష్టం. ఆయన రాసిన చాలా పుస్తకాలు చదివాం. వాటి ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్‌లో కొన్ని సన్నివేశాలు రాశాం’ అని అన్నారు. దీంతో మహేశ్‌ ఫ్యాన్స్‌ ఖుష్ అవుతున్నారు.

యాక్షన్‌ మూవీ కావడంతో ఈ సినిమాకు ఎక్కువ రోజులు ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తోన్నారు. సినిమా కథకు తగినవిధంగా పాత్రలు, వాటి స్కెచ్‌లను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కథా నేపథ్యానికి సంబంధించిన సెట్స్‌ డిజైన్‌ పైనా కసరత్తు చేస్తున్నట్లు టాక్‌. ఇక ఈ సినిమాలో మహేశ్‌ ఎనిమిది లుక్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి స్కెచ్‌లు పూర్తయ్యాయని సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘మహారాజ్‌’ (Maharaj) అనే టైటిల్‌ను అనుకుంటున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని