Maidaan: మైదానంలోకి దిగే ముహుర్తం ఖరారు

జాతీయ ఉత్తమ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘మైదాన్‌’. 1950 నుంచి 1963 వరకు భారత ఫుట్‌బాల్‌ జట్టుకి కోచ్‌, మేనేజర్‌గా ఉంటూ సర్వస్వం ధారపోసిన సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవితం ఆధారంగా రూపొందించారు.

Updated : 02 Oct 2022 08:17 IST

జాతీయ ఉత్తమ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) కథానాయకుడిగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘మైదాన్‌’ (Maidaan). 1950 నుంచి 1963 వరకు భారత ఫుట్‌బాల్‌ జట్టుకి కోచ్‌, మేనేజర్‌గా ఉంటూ సర్వస్వం ధారపోసిన సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవితం ఆధారంగా రూపొందించారు. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని సినీవర్గాలు ఎట్టకేలకు శనివారం ఖరారు చేశాయి. ఎట్టకేలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అజయ్‌ దేవ్‌గణ్‌ ‘మరుగున పడిపోయిన ఒక నిజమైన హీరో సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవిత చరిత్రే ఈ సినిమా. ఆయన ఇండియాకి, భారతీయ ఫుట్‌బాల్‌ జట్టుకి స్వర్ణయుగం తీసుకొచ్చారు’ అంటూ ట్వీట్‌ చేశారు. ‘బధాయీ హో’ ఫేం అమిత్‌ రవీంద్రనాథ్‌శర్మ దర్శకుడు. ప్రియమణి, గజ్‌రాజ్‌ రావు, రుద్రనీల్‌ ఘోష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆకాష్‌ చావ్లా, అరుణవ జాయ్‌ సేన్‌గుప్తా నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని