Malaikottai Vaaliban ott: మోహన్‌లాల్‌ ‘మలైకోటై వాలిబన్‌’.. ఓటీటీ రిలీజ్‌ ఫిక్స్‌

మోహన్‌లాల్‌ కీలక పాత్రలో నటించిన ‘మలైకోటై వాలిబన్‌’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Updated : 19 Feb 2024 19:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మోహన్‌లాల్‌ (Mohanlal) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘మలైకోటై వాలిబన్‌’ (malaikottai vaaliban telugu). రిపబ్లిక్‌ డే సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈవిషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ వేదిక ట్రైలర్‌ను విడుదల చేసింది.

బ్రిటిష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రం కోసం ఓ ప్రాంత ప్రజలు చేసిన పోరాటం నేపథ్యంలో దర్శకుడు లిజో జోస్‌ పెల్లిస్సేరి ఈ చిత్రాన్ని రూపొందించారు. రెజ్లర్‌ వాలిబన్‌ పాత్రలో మోహన్‌లాల్‌ నటించారు. సోనాలీ కులకర్ణి, హరీశ్‌ పేరడీ ఇతర కీలకపాత్రలు పోషించారు. దాదాపు రూ.65 కోట్ల  భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కేవలం రూ.30 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని