Prabhas: ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పి ఫ్యాన్స్ మనసు దోచేసిన నటి
తాజాగా మాళవిక మోహనన్ (Malavika Mohanan) ట్విటర్‌లో తన అభిమానులతో ముచ్చటించారు. అందులో భాగంగా ప్రభాస్ (Prabhas) గురించి ఒక్క మాటలో చెప్పారు.
హైదరాబాద్: తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) అన్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ నటి తాజాగా ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పారు. అందులో భాగంగా ఓ అభిమాని ప్రభాస్ (Prabhas) గురించి ఒక్క మాటలో చెప్పమని అడగ్గా.. మాళవిక చెప్పిన సమాధానం రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.
మారుతీ - ప్రభాస్‌ల సినిమా గురించి మాట్లాడిన మాళవిక.. ‘ఈ మూవీతో టాలీవుడ్‌లోకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులోని సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. చిత్రబృందం ఈ షెడ్యూల్స్ గురించి అధికారికంగా ప్రకటించే వరకు వేచి ఉండాలి. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు నేను చాలా ఆసక్తిగా ఉన్నాను’ అని చెప్పారు. ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పమని అడగ్గా.. ‘తనకు ఎవరైనా ఆకర్షితులవుతారు’ అని చెప్పారు. దీంతో ప్రభాస్ అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు. ఇక మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ చిత్రం హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. మాళవిక మోహనన్‌తో పాటు నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ‘రాజా డీలక్స్’ పేరుతో ఇది ప్రచారంలో ఉంది. మరోవైపు ప్రభాస్ నటిస్తోన్న ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధమవుతోంది. వీటితో పాటు ‘సలార్’, ‘ప్రాజెక్ట్ - కె’ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh: ప్రొద్దుటూరులో లోకేశ్‌పై కోడిగుడ్డు విసిరిన ఆకతాయి.. దేహశుద్ధి చేసిన కార్యకర్తలు
-
India News
Delhi Highcourt: మద్యం పాలసీ మంచిదైతే.. ఎందుకు వెనక్కి తీసుకున్నట్లు?
-
General News
CM KCR: ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భం: సీఎం కేసీఆర్
-
India News
Gulf countries: ఇకపై తక్కువ ఖర్చుతో గల్ఫ్ ప్రయాణం!
-
Politics News
హెడ్‌లైన్స్ కోసమే నీతీశ్ అలా చేస్తున్నారు.. విపక్షాల ఐక్యత కుదిరే పనేనా?: సుశీల్ మోదీ
-
Sports News
MS Dhoni: ధోని మోకాలి శస్త్రచికిత్స విజయవంతం