mama mascheendra: ముగ్గురూ ముగ్గురే

సుధీర్‌బాబు (Sudheer Babu) త్రిపాత్రాభినయంతో రూపొందుతున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఈషా రెబ్బా, మృణాళిని రవి కథానాయికలు. హర్షవర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 23 Apr 2023 12:26 IST

సుధీర్‌బాబు (Sudheer Babu) త్రిపాత్రాభినయంతో రూపొందుతున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’ (mama mascheendra). ఈషా రెబ్బా, మృణాళిని రవి కథానాయికలు. హర్షవర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్‌, పూస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు ఆదివారం విడుదల చేశారు. భారీకాయుడిగా... డాన్‌గా... డీజేగా మూడు పాత్రల్లో సందడి చేస్తున్నారు సుధీర్‌బాబు. ‘దేవుడు అడిగాడంట... నన్ను చేరడానికి ఏడు జన్మలు నాకు భక్తులుగా బతుకుతారా? లేక మూడు జన్మలు రాక్షసులుగా బతుకుతారా అని! ఏడు జన్మలు నీకు దూరంగా ఉండేకన్నా మూడు జన్మల రాక్షస బతుకే మిన్న అని దేవతలే కోరుకున్నారంట’ అంటూ మొదలయ్యే టీజర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: పి.జి.విందా, సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌, కళ: రాజీవ్‌, సమర్పణ: సోనాలి నారంగ్‌, సృష్టి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని