Mammootty: ల్యూక్‌ ఆంటోని వస్తున్నాడు

ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన సైకలాజికల్‌ యాక్షన్‌ చిత్రం ‘రాస్‌చాక్‌’. ప్రతీకార థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని ఈ నెల 7న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.

Updated : 01 Oct 2022 13:56 IST

ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి (Mammootty) నటించిన సైకలాజికల్‌ యాక్షన్‌ చిత్రం ‘రాస్‌చాక్‌’ (Rorschach). ప్రతీకార థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని ఈ నెల 7న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ని పంచుకుంది. ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. నిషమ్‌ బషీర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ల్యూక్‌ ఆంటోని అనే పాత్రలో మమ్ముట్టి నటించారు. అఖిల్‌ చిత్రం ‘ఏజెంట్‌’లో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు మమ్ముట్టి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని