‘మనం’ ప్రత్యేక ప్రదర్శనలు

మూడు తరాల కథానాయకులు కలిసి చేసిన సినిమాగా... ఏఎన్నార్‌  చివరి చిత్రంగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ  గుర్తుండిపోతుంది ‘మనం’. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదలై ఈ నెల 23తో పదేళ్లు పూర్తవుతున్నాయి.

Published : 18 May 2024 00:25 IST

మూడు తరాల కథానాయకులు కలిసి చేసిన సినిమాగా... ఏఎన్నార్‌  చివరి చిత్రంగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ  గుర్తుండిపోతుంది ‘మనం’. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదలై ఈ నెల 23తో పదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 23న ప్రత్యేక ప్రదర్శనల్ని నిర్వహిస్తున్నట్టు నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ‘‘నా మనసులో ‘మనం’ ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. పదేళ్ల వేడుకల్ని చేసుకోవడానికి, తిరిగి థియేటర్లోకి తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అంటూ నాగచైతన్య ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రియ కలిసి నటించిన ఈ చిత్రానికి  విక్రమ్‌ కె.కుమార్‌  దర్శకత్వం వహించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని