Manchu Manoj: తండ్రైన మంచు మనోజ్‌..

నటుడు మంచు మనోజ్‌ (Manchu manoj) తండ్రయ్యారు.

Updated : 13 Apr 2024 13:46 IST

హైదరాబాద్‌: నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) శుభవార్త చెప్పారు. తన సోదరుడు, నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) తండ్రయ్యారని వెల్లడించారు. ఆయన సతీమణి మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారని తెలిపారు.

‘‘భగవంతుడి ఆశీస్సులతో మా ఇంట చిన్నారి దేవత అడుగుపెట్టింది. మనోజ్‌, మౌనిక ఆనందంగా తమ పాపను ఈ భూమ్మీదకు ఆహ్వానించారు. ఆ పాపను మేము ప్రేమగా ‘ఎంఎం పులి’ అని పిలుస్తున్నాం. ఆ శివుడి ఆశీస్సులు ఈ కుటుంబంపై ఉండాలని, వీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. దీనిని మంచు మనోజ్‌ రీపోస్ట్‌ చేశారు. పలువురు నెటిజన్లు స్పందిస్తూ అభినందనలు చెబుతున్నారు. 

ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో గతేడాది మనోజ్‌ - మౌనిక వివాహం జరిగిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉన్న ఈ హీరో ప్రస్తుతం ‘వాట్‌ ది ఫిష్‌’ కోసం సిద్ధమవుతున్నారు. వరుణ్‌ కోరుకొండ దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. నిహారిక కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని