Manchu Vishnu: తెలుగు చిత్ర పరిశ్రమ @ 90 ఏళ్లు.. జులైలో వేడుకలు: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ శనివారం మీడియా సమావేశం నిర్వహించింది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని కొనియాడారు.

Updated : 23 Mar 2024 15:23 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ శనివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) తెలిపారు. ఈ వేడుకల ద్వారా ఫండ్‌ రైజ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ‘మా’ సభ్యుల బాగోగుల కోసం వాటిని ఉపయోగించనున్నామన్నారు.

‘‘మలేసియా వేదికగా జులై నెలలో వేడుకలు నిర్వహించనున్నాం. సినీ పెద్దలతో చర్చించి.. వారి ఆశీస్సులు తీసుకుని తేదీని ప్రకటిస్తాం. ఈ మేరకు జులైలో షూటింగ్‌లకు మూడు రోజులపాటు సెలవులు ఇవ్వాలని కోరాం. దీనిపై ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు దిల్‌ రాజు సానుకూలంగా స్పందించారు. దేశంలోని ఐదు అసోసియేషన్లతో ‘మా’ ఒప్పందం చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఘన కీర్తిని చాటి చెప్పేందుకే ఈ వేడుకలు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు గొప్ప దశలో ఉంది. ఈ సమయంలో నటీనటులుగా ఉన్నందుకు గర్వపడుతున్నా. చిరంజీవికి పద్మవిభూషణ్‌ రావడం గర్వించాల్సిన విషయం’’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని