Navarasa: వెబ్ సిరీస్ కా బాప్ ‘నవరస’ టీజర్
ఇటీవల కాలంలో వెబ్‌సిరీస్‌లకు విశేష ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ చూడని
ఇంటర్నెట్‌డెస్క్: ఇటీవలి కాలంలో వెబ్‌సిరీస్‌లకు విశేష ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ చూడని భారీ తారాగణంతో రాబోతున్న ఆసక్తికర వెబ్‌సిరీస్ ‘నవరస’. మణిరత్నం సృష్టికర్తగా రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్‌ను తొమ్మిది మంది దర్శకులు తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ వెబ్‌సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు.
రతీంద్రన్ ఆర్. ప్రసాద్, అరవింద్ స్వామి, బిజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ మేనన్, సర్జున్ కె.ఎం, ప్రియదర్శన్, కార్తీక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజ్, వసంత్ ఇలా తొమ్మిది మంది దర్శకులు 9 భాగాలను తెరకెక్కిస్తున్నారు. సూర్య, సిద్ధార్థ్, ప్రకాశ్‌రాజ్, విజయ్ సేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేశ్, అరవింద్ స్వామి, రోబో శంకర్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నవరస’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆగస్టు 6వ తేదీన ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సిరీస్‌కి ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరో దర్శకుడు జయేంద్రతో కలిసి మణిరత్నం నిర్మిస్తున్న ఈ కథా సంకలనం తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన సినీ కార్మికులని ఆదుకోవడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంది. హాస్యం, శృంగారం, కరుణ, శాంతం, రౌద్రం, బీభత్సం, భయానకం, అద్భుతం, వీరం... ఇలా నవరసాలతో కూడిన చిత్రాలు ఇవి. ఒక్కో కథ ఒక్కో భావోద్వేగం నేపథ్యంగా సాగుతుంది. మరి తొమ్మిది కథలు సంగతి ఏంటి? ఎవరు ఏయే పాత్రల్లో అలరించనున్నారు? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అప్పటివరకూ ఈ టీజర్ చూసేయండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!