Adipurush: ‘ఆదిపురుష్‌’.. అది తప్పే: డైలాగ్‌ రైటర్‌ కీలక వ్యాఖ్యలు

‘ఆదిపురుష్‌’ డైలాగ్స్‌ వివాదంపై తాజాగా చిత్ర మాటల రచయిత మనోజ్‌ స్పందించారు. అలాంటి పదాలు రాయడం తప్పేనన్నారు.

Published : 10 Nov 2023 13:39 IST

ముంబయి: ప్రభాస్‌ (Prabhas) - కృతిసనన్‌ (Kriti sanon) జంటగా నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఓంరౌత్‌ దర్శకుడు. ఈ సినిమాలోని డైలాగ్స్‌ వివాదంపై తాజాగా చిత్ర మాటల రచయిత మనోజ్‌ ముంతాషిర్‌ శుక్లా స్పందించారు. అది 100 శాతం తప్పేనని అంగీకరించారు. ‘‘సినిమా కోసం అద్భుతంగా మాటలు రాశానని చెప్పి నా పనిని ప్రశంసించుకునే అభద్రతా భావం నాకు లేదు. అది 100 శాతం తప్పే. శ్రీరాముడు, హనుమంతుడు, సనాతన ధర్మాన్ని తప్పుగా చూపించాలనే చెడు ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. కాకపోతే నేను పెద్ద తప్పే చేశా. ఈ ఘటన నుంచి ఎంతో నేర్చుకున్నా. ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది. డైలాగ్స్‌ విషయంలో వివాదం నెలకొన్నప్పుడు నేను సరిగ్గా స్పందించలేకపోయాను. అది కూడా తప్పే’’ అని ఆయన అన్నారు.

Rashmika: షాకింగ్‌.. రష్మికపై మరో ఫేక్‌ వీడియో వైరల్‌

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ‘ఆదిపురుష్‌’ను తీర్చిదిద్దారు. రాఘవగా ప్రభాస్‌.. జానకిగా కృతిసనన్‌.. రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‌తో ఇది సిద్ధమైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ముఖ్యంగా సినిమాలోని హనుమంతుడి డైలాగ్స్‌ విషయంలో వివాదం చెలరేగింది. హనుమంతుడితో ఇబ్బందికరమైన పదాలు మాట్లాడించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో చిత్రబృందం అప్పట్లో క్షమాపణలు చెప్పి.. డైలాగ్స్‌ మార్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని