Masooda: భయం భయం

సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌రామ్‌, బాందవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మసూద’. సాయికిరణ్‌ దర్శకుడు. రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించిన ఈ సినిమాని నవంబరు 11న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Updated : 01 Oct 2022 14:02 IST

సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌రామ్‌, బాందవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మసూద’ (Masooda). సాయికిరణ్‌ దర్శకుడు. రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించిన ఈ  సినిమాని నవంబరు 11న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కొత్త రకమైన హారర్‌ డ్రామాతో రూపొందిన చిత్రమిది. ప్రేక్షకుల్ని భయపెడుతూ, థ్రిల్‌ని పంచుతుంది. ‘మళ్ళీ రావా’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తర్వాత మా సంస్థ నుంచి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడం ఆనందంగా ఉంది. తెలుగుతోపాటు, ఇతర భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తాం’’ అన్నారు. శుభలేఖ సుధాకర్‌, అఖిలారామ్‌, బాంధవి శ్రీధర్‌, సత్యం రాజేష్‌, సత్య ప్రకాశ్‌ తదితరులు నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని