Maya Petika: ‘ఈటీవీ విన్‌’లో ‘మాయా పేటిక’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

పాయల్‌ రాజ్‌పుత్‌, సిమ్రత్‌ కౌర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాయా పేటిక’ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది.

Published : 15 May 2024 17:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput), సిమ్రత్‌ కౌర్‌ (Simrat Kaur), సునీల్‌ (Sunil), శ్రీనివాసరెడ్డి, విరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాయా పేటిక (Maya Petika). రమేశ్‌ రాపార్తి దర్శకుడు. ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో ఈ సినిమా ఈనెల 16 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈమేరకు సంస్థ సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్‌ విడుదల చేసింది. మానవ జీవితంలో భాగమైన సెల్‌ఫోన్‌ ఇతివృత్తంగా సాగే కథతో రూపొందిన సినిమా ఇది. గతేడాది థియేటర్లలో విడుదలైంది.

ఇదీ కథ: హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ (పాయల్‌ రాజ్‌పుత్‌)కు ఓ నిర్మాత సెల్‌ఫోన్‌ను కానుకగా ఇస్తాడు. ఆ ఫోన్ వల్ల తనకు కాబోయే భర్తతో పాయల్‌కు గొడవలు తలెత్తుతాయి. ఆ సమస్యకు పరిష్కారంగా ఫోన్‌ను అసిస్టెంట్‌కు ఇస్తుందామె. ఆ అసిస్టెంట్‌ కొన్నాళ్లు వినియోగించిన ఫోన్‌ చేతులు మారుతూ పాకిస్థాన్ చేరుకుంటుంది. అసలు ఆ ఫోన్‌లో ఏముంది? దానివల్ల కార్పొరేటర్ కన్నె కామేశ్వరరావు (పృథ్వీరాజ్) జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలేంటి? అలీ (విరాజ్ అశ్విన్), ఆస్రా (సిమ్రత్ కౌర్)ల ప్రేమ కథేంటి? బతుకుదెరువు కోసం వేషాలు వేసే శ్రీను (శ్రీనివాసరెడ్డి) జీవితంలో వచ్చిన మార్పేంటి? అన్నదే మిగతా కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని