VT13: వరుణ్‌ సరసన నటించనున్న మాజీ ప్రపంచ సుందరి..!

వరుణ్‌ తేజ్‌ తాజా చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. వరణ్‌ రానున్న మూవీలో మాజీ ప్రపంచ సుందరితో జతకట్టనున్నడని టాక్‌.

Published : 16 Nov 2022 16:27 IST

హైదరాబాద్‌: మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. తాజాగా శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో ఈ మెగా హీరో పాన్‌ ఇండియా ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఇంకా పేరు ఖరారు కానీ ఈ సినిమా VT13గా ప్రచారంలో ఉంది. డిసెంబర్‌ నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ రూమర్‌ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో వరుణ్‌ సరసన మాజీ ప్రపంచ సుందరి నటిస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుపొందిన మానుషి చిల్లార్‌(Manushi Chhillar) VT13లో వరుణ్‌తో కలిసి రొమాన్స్‌ చేయనున్నట్లు సోషల్‌మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. మేకర్స్‌ మానుషికి కథ వినిపించారని దానికి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇదే నిజమైతే ఇటీవల సామ్రాట్‌ పృథ్వీరాజ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అందాల తార వరుణ్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే అఖిల్‌ ఏజెంట్‌ సినిమాతో సాక్షి వైద్య(Sakshi Vaidya) కథానాయికగా పరిచయం కానుంది. అటు కల్యాణ్‌ రామ్‌ సినిమాతో అషిక రంగనాథ్‌(Ashika Ranganath) తెలుగులోకి అరంగేట్రం చేయనుంది. ఇప్పుడు వరుణ్‌ సినిమాతో మరో ముంబయి బ్యూటీ తెలుగు తెరపై కనిపించనుందనే వార్తలు వస్తున్నాయి. అంటే రానున్న ఏడాదిలో టాలీవుడ్‌లో ముంబయి భామల హవా కొనసాగనుంది. ఇక సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంతో వరుణ్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. వైమానిక దళం ఎదుర్కొనే సవాళ్లను చూపనున్న ఈ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ యాక్షన్‌ డ్రామా 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని