Miheeka Bajaj: ఆ వార్తల్లో నిజం లేదు: రానా సతీమణి మిహీకా
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన స్కిన్ కేర్ క్లినిక్ ప్రారంభోత్సవంలో నటుడు రానా (Rana) సతీమణి మిహీకా బజాజ్ (Miheeka) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె మీడియాతో కాసేపు ముచ్చటించారు.
హైదరాబాద్: నటుడు రానా (Rana) - ఆయన సతీమణి మిహీకా బజాజ్ (Miheeka Bajaj) త్వరలో శుభవార్త చెప్పనున్నారంటూ ఇటీవల కాలంలో వార్తలు వచ్చాయి. మిహికా బజాజ్ పోస్ట్ చేసిన పలు ఫొటోలు చూసిన నెటిజన్లు ఆమె తల్లి కాబోతున్నారంటూ మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వార్తలపై తాజాగా ఆమె ఓ మీడియా సమావేశంలో స్పందించారు. అవన్నీ వదంతులు మాత్రమేనని అన్నారు. తన ఫొటోలు చూసి అందరూ తప్పుగా అనుకుంటున్నారని చెప్పారు.
‘‘ప్రస్తుతానికి నేను ప్రెగ్నెంట్ కాదు. నేను పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నాను. ఈ మధ్యకాలంలో బరువు పెరిగాను. దాంతో అందరూ నన్ను చూసి ప్రెగ్నెంట్ అనుకుంటున్నారంతే. ప్రెగ్నెంట్ అయినప్పుడు.. ఆ శుభవార్తను తప్పకుండా అందరితో పంచుకుంటా’’ అని మిహికా తెలిపారు. అలాగే, ప్రస్తుతం తన దృష్టి మొత్తం మెంటల్ హెల్త్‌కు సంబంధించిన ప్రాజెక్ట్‌పైనే ఉందని చెప్పారు. తనకు తెరపై కనిపించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇక, రానా-మిహీకా 2020లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/10/2023)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్