Mohanlal: డిన్నరేనా.. డ్యాన్స్‌ వద్దా?: షారుక్‌ఖాన్‌తో మోహన్‌లాల్‌

మోహన్‌లాల్‌ డ్యాన్స్‌ను షారుక్‌ ఖాన్‌ మెచ్చుకున్నారు. షారుక్‌పై మోహన్‌లాల్‌ ప్రశంసలు కురిపించారు.

Published : 23 Apr 2024 23:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తేనే కాదు ఏదైనా వేదికను పంచుకున్నా.. సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నా సినీ ప్రియులు ఖుషీ అవుతారు. గతంలో ఆయా నటులు కలిసి దిగిన ఫొటోలు పంచుకుంటూ సందడి చేస్తుంటారు. షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), మోహన్‌లాల్‌ (Mohanlal) ట్వీట్లతో ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌)లో ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. మోహన్‌లాల్‌ ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో ‘జిందా బందా’ (షారుక్‌ నటించిన జవాన్‌ చిత్రంలోనిది) సాంగ్‌కు డ్యాన్స్‌ చేశారు. ఆ దృశ్యాలను ‘షారుక్‌ ఖాన్‌ యూనివర్స్‌ ఫ్యాన్ క్లబ్‌’ పేజ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ఆ వీడియో చూసిన షారుక్‌ స్పందించారు. ‘‘ఈ పాటకు స్టెప్పులేసి దాన్ని ప్రత్యేకంగా నిలిపినందుకు మోహన్‌లాల్‌ సర్‌ మీకు థ్యాంక్స్‌. మీరు చేసిన దాంట్లో నేను సగం చేశాననుకుంటున్నా. లవ్‌ యూ సర్‌. మీతో కలిసి డిన్నర్‌ చేసేందుకు వేచి చూస్తున్నా’’ అని పేర్కొన్నారు.

‘‘డియర్‌ షారుక్‌.. మీలాగా ఎవరూ చేయలేరు. డ్యాన్స్‌లో మీది ప్రత్యేకమైన శైలి. మీ కామెంట్‌కు థ్యాంక్స్‌. కేవలం డిన్నరేనా.. మనమెందుకు కలిసి ‘జిందా బందా’ (Zinda Banda)కు డ్యాన్స్‌ చేయకూడదు?’’ అని షారుక్‌ ట్వీట్‌కు మోహన్‌లాల్‌ బదులిచ్చారు. దీంతో ‘ఓకే సర్‌.. మీ ఇంట్లోనా? మా ఇంట్లోనా?’ అంటూ షారుక్‌ మరో ట్వీట్‌ చేశారు. వీరిద్దరి ట్వీట్లపై స్పందించిన అత్యధిక మంది నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో లవ్‌ సింబల్‌ జోడించారు. ‘మీ ఇద్దరినీ ఒకే సినిమాలో చూడొచ్చా?’ అంటూ కొందరు కామెంట్లు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని