Upcoming Movies: ఈ రిపబ్లిక్‌ డేకి.. థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!

సంక్రాంతి తర్వాత మరోసారి సినీ ప్రేక్షకులను పలకరించడానికి ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. థియేటర్‌తో పాటు, ఓటీటీలోనూ అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ రిపబ్లిక్‌ డే సందర్భంగా వస్తున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లేంటో చూసేయండి.

Updated : 22 Jan 2024 11:36 IST

యాక్షన్‌ ‘ఫైటర్‌’

హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొణె (Deepika Padukone) జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఫైటర్‌’ (Fighter). సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించారు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్‌ యాక్షన్‌ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఇందులో యుద్ధ విమాన పైలట్‌గా హృతిక్‌ కనిపించనున్నాడు. అనిల్‌ కపూర్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం జనవరి 25న థియేటర్స్‌లో విడుదల కానుంది.


వాలిబన్‌.. ఓటమెరుగని రెజ్లర్‌

భిన్నమైన కథలు.. వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ముందుండే నటుడు మోహన్‌లాల్‌.  ఆయన కీలక పాత్రలో లిజో జోస్‌ పెలిసెరీ దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్‌ డ్రామా ‘మలైకోటై వాలిబన్‌’ (Malaikottai Vaaliban). ఇందులో మోహన్‌లాల్‌ (Mohanlal) ఓటమెరుగని రెజ్లర్‌ వాలిబన్‌ పాత్రలో కనిపించనున్నారు.  బ్రిటీష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రం కోసం ఓ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ‘మలైకోటై వాలిబన్‌’కి సీక్వెల్‌ను కూడా చిత్ర బృందం సిద్ధం చేస్తోంది.


భిన్నమైన అవతారాల్లో ధనుష్‌..

ధనుష్‌ (Dhanush) కథానాయకుడిగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయిక. సందీప్‌కిషన్‌, శివరాజ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. జి.శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌ నిర్మాతలు. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. ఇందులో ధనుష్‌ తిరుగుబాటు నాయకుడిగా కనిపించారు. జనవరి 25న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.


తమిళంలో హిట్‌.. మరి ఇక్కడ?

ఈసారి సంక్రాంతికి తమిళంలో సందడి చేసిన మరొక చిత్రం ‘అయలాన్‌’ (Ayalaan). శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan), రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) జంటగా నటించారు. ఆర్‌.రవికుమార్‌ దర్శకత్వం వహించారు. సంక్రాంతికి తెలుగు బాక్సాఫీస్‌ వద్ద వరుస సినిమాలు సందడి చేయడంతో ‘అయలాన్‌’ వాయిదా పడింది. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శివ కార్తికేయన్‌ నటన, కామెడీ,  గ్రహాంతరవాసి హంగామా తమిళ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు అభిమానుల్నీ తప్పకుండా మెప్పిస్తుందని చిత్ర బృందం చెబుతోంది.


ప్రయోగాత్మక చిత్రంతో హన్సిక

ఒకే ఒక్క పాత్రతో తెరకెక్కిన చిత్రం ‘105 మినిట్స్‌’. ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్ర పోషించగా... రాజు దుస్సా దర్శకత్వం వహించారు. బొమ్మక్‌ శివ నిర్మించారు. జనవరి 26న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.


వీటితో పాటు ‘మూడో కన్ను’, ‘రామ్‌: రాపిడ్‌ యాక్షన్ మిషన్‌’, ‘బిఫోర్‌ మ్యారేజ్‌’, ‘ప్రేమలో..’ తదిర చిత్రాలు విడుదల కానున్నాయి.


ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

 • నెట్‌ఫ్లిక్స్‌
 • క్వీర్‌ ఐ (వెబ్‌సిరీస్‌ )జనవరి 24
 • సిక్స్‌ నేషన్స్‌ (వెబ్‌సిరీస్‌)  జనవరి 24
 • యానిమల్‌ (హిందీ/తెలుగు) జనవరి 26 (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది)
 • బ్యాడ్‌ల్యాండ్‌ హంటర్స్‌(కొరియన్‌) జనవరి 26
 • అమెజాన్‌ ప్రైమ్‌
 • హస్లర్స్‌ (హిందీ) జనవరి 24
 • పంచాయత్‌ (హిందీ) జనవరి 26
 • జీ5
 • శామ్‌ బహదూర్‌ (హిందీ) జనవరి 26

 • డిస్నీ+హాట్‌స్టార్‌
 • నేరు (మలయాళం) జనవరి 23
 • కర్మా కాలింగ్‌ (హిందీ) జనవరి 26
 • ఫ్లెక్స్‌ ఎక్స్‌ కాప్‌ (కొరియన్‌) జనవరి 26
 • ఫైట్‌ క్లబ్‌ (తమిళం) జనవరి 27
 • సోనీలివ్‌
 • షార్క్‌ ట్యాంక్‌ ఇండియా (హిందీ) జనవరి 22
 • బుక్‌ మై షో
 • వోంకా (హాలీవుడ్‌) జనవరి 22
 • ఆక్వామెన్‌2 (హాలీవుడ్‌) జనవరి 23
 • ఫియర్‌ (హాలీవుడ్) జనవరి 23
 • యాపిల్‌ టీవీ ప్లస్‌
 • మాస్టర్స్‌ ఆఫ్‌ ది ఎయిర్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 26
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని