Mrunal Thakur: ఆ నియమం ప్రకారమే ప్రయాణం

‘‘రాత్రికి రాత్రే జీవితం మారిపోవాలనే ఆలోచనతో నేనెప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదు. తాత్కాలికంగా వచ్చే పేరు, డబ్బు కంటే..  ప్రేక్షకులు కొన్నాళ్లపాటు గుర్తుంచుకునేలా నా పనితీరు ఉండాలనుకున్నా.

Updated : 13 Apr 2024 11:46 IST

‘‘రాత్రికి రాత్రే జీవితం మారిపోవాలనే ఆలోచనతో నేనెప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదు. తాత్కాలికంగా వచ్చే పేరు, డబ్బు కంటే..  ప్రేక్షకులు కొన్నాళ్లపాటు గుర్తుంచుకునేలా నా పనితీరు ఉండాలనుకున్నా. ఇలా కష్టపడటంలోనే నాకు ఎక్కువ సంతృప్తి దొరుకుతోంద’’ని చెప్పింది మృణాల్‌ ఠాకూర్‌. కథానాయికగా తెలుగులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఈమె... ఇటీవల ‘ఫ్యామిలీస్టార్‌’తో సందడి చేసింది. ఓ నటిగా తను కథల్ని ఎంపిక చేసుకునే శైలి గురించి ఆమె ఇలా చెప్పుకొచ్చింది. ‘‘ఒక సినిమా కోసం వందల రోజులు సమయం కేటాయిస్తున్నప్పుడు ఆ ప్రయాణం ఎంతో ఉత్సాహంగా ఉండాలి. సరైన కథలు, పాత్రల్ని ఎంచుకున్నప్పుడే  నటీనటుల్లో ఆ ఉత్సాహం ఉంటుంది. అందుకే కథల విషయంలో చాలా పక్కాగా ఉంటా. జయాపజయాలనేవి సహజమే. కానీ ఆ ఫలితాలేవైనా సరే, వాటిని సంతృప్తికరంగా స్వీకరించగలిగేలా ప్రయాణం సాగించాలనేదే నా నియమం’’ అని చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని