Mrunal Thakur: ఎప్పటికీ అతడే నాకిష్టమైన కోస్టార్‌: మృణాల్‌ ఠాకూర్‌

‘ఫ్యామిలీ స్టార్‌’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు మృణాల్ ఠాకూర్‌. తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ తనకు ఇష్టమైన కోస్టార్‌ ఎవరో చెప్పారు.

Published : 02 Apr 2024 15:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతీ సినిమాలోనూ తన నటనతో అలరిస్తూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతున్నారు మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur). పరశురామ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండతో కలిసి ఆమె నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) విడుదలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుండటంతో దీని ప్రమోషన్స్‌ జోరందుకున్నాయి. తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో మృణాల్‌ మాట్లాడుతూ ‘సీతారామం’ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఎప్పటికీ తనకు ఇష్టమైన కోస్టార్ అని పేర్కొంది. 

‘నాకు ఇష్టమైన సహనటుడు ఎవరని అడిగితే సమాధానం చెప్పడం కష్టమే. కానీ, దుల్కర్‌ సల్మాన్‌ అని చెబుతాను. ఎందుకంటే ‘సీతారామం’లో నేను చేసిన పాత్ర చాలా కష్టంగా అనిపించింది. ఆ సమయంలో దుల్కర్‌ అడుగడుగునా ధైర్యాన్నిచ్చాడు. అతడి వల్లే నేను ఆ పాత్ర చేయగలిగాను. ఇన్ని భాషల్లో నటిస్తున్నానంటే కూడా ఆయనే స్ఫూర్తి. నాకు మంచి స్నేహితుడు’ అని పేర్కొన్నారు. తన అప్‌కమింగ్‌ మూవీ ‘ఫ్యామిలీ స్టార్‌’ గురించి మాట్లాడుతూ ఇది పూర్తి స్థాయి కుటుంబానికి సంబంధించిన సినిమా అని తెలిపారు. 

అక్కడ రిలీజ్‌ కానున్న తెలుగు సినిమాగా రికార్డు..
ఇప్పటికే ట్రైలర్‌, పాటలతో ఆకట్టుకున్న ‘ఫ్యామిలీ స్టార్‌’కు సంబంధించిన ఓ వార్త నెటిజన్లలో ఆసక్తి కలిగిస్తుంది. సౌత్‌ అమెరికాలోని ఉరుగ్వే దేశంలోనూ ఇది రిలీజ్‌ కానుంది. గతంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి పెద్ద సినిమాలు కూడా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, జపాన్‌లలోనే విడుదలయ్యాయి. కానీ, ఇక్కడ మాత్రం రిలీజ్‌ కాలేదు. దీంతో ఆ దేశంలో విడుదల కానున్న మొదటి తెలుగు సినిమాగా ‘ఫ్యామిలీ స్టార్‌’ రికార్డు నెలకొల్పింది. మరి ఉరుగ్వే దేశంతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం ఎలాంటి హవా చూపిస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని