Mukhachitram: ఆసక్తికరంగా ముఖచిత్రం ట్రైలర్‌..

యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ అతిథి పాత్రలో నటిస్తున్న సినిమా ‘ముఖచిత్రం’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. 

Published : 01 Dec 2022 13:17 IST

హైదరాబాద్‌: డిసెంబర్‌లో రానున్న చిత్రాల్లో ‘ముఖచిత్రం’(Mukhachitram) ఒకటి. యంగ్‌ దర్శకుడు సందీప్‌ రాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వికాస్‌ వశిష్ట హీరోగా నటిస్తున్నాడు. ఆయన సరసన ప్రియ వడ్లమాని హీరోయిన్‌గా అలరించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ముక్కోణపు లవ్‌స్టోరీ అంటూ మొదలైన ఈ ట్రైలర్ ఎన్నో మలుపులతో ఆసక్తికరంగా ఉంది. ఒక అమ్మాయి ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేసి మరో అమ్మాయిలా మారిస్తే.. ఏం జరుగుతుంది. వాళ్ల పాత్రలకు హీరోకు ఉన్న సంబంధం ఏంటి?ఇలాంటి అంశాలతో ఎంతో ఆసక్తిరేపుతోంది ఈ ట్రైలర్‌. ఇక ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్‌, నటుడు రవిశంకర్‌ ప్రధాన పాత్రలో కనిపించారు. అలాగే యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ లాయర్‌గా అతిథి పాత్రలో తన పంచ్‌ డైలాగులతో అలరించారు. డిసెంబర్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని