Murthy: అందరిలోనూ ఆలోచన రేకెత్తించే చిత్రమిది

‘‘వ్యవస్థని ప్రశ్నించడం మొదలుపెట్టి... ప్రక్షాళన చేయడం వరకూ సాగిన ఓ పాత్రికేయుడి ప్రయాణమే మా చిత్రం’’ అన్నారు మూర్తి దేవగుప్తపు. స్వతహాగా పాత్రికేయుడైన ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ప్రతినిధి 2’.

Updated : 21 Apr 2024 13:36 IST

‘‘వ్యవస్థని ప్రశ్నించడం మొదలుపెట్టి... ప్రక్షాళన చేయడం వరకూ సాగిన ఓ పాత్రికేయుడి ప్రయాణమే మా చిత్రం’’ అన్నారు మూర్తి దేవగుప్తపు. స్వతహాగా పాత్రికేయుడైన ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ప్రతినిధి 2’. నారా రోహిత్‌ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం 25న రానుంది. ఈ సందర్భంగా మూర్తి శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ‘‘ఇది ఏ పార్టీనీ, ఏ నాయకుడినీ లక్ష్యంగా చేసుకుని తీసిన సినిమా కాదు. ‘ప్రతినిధి’ సినిమాలో హీరో వ్యవస్థ బయట ఉంటూ ప్రశ్నించాడు. ఈ సినిమాలో వ్యవస్థలో ఉంటూనే ప్రశ్నిస్తాడు. ఎన్నికలకు ముందు వస్తుంది కదా అని దీన్ని మరో కోణంలో చూడాల్సిన అవసరం లేదు. రాజకీయ వాతావరణంతో ప్రజలంతా ఆ ఆలోచనల్లో ఉన్నప్పుడు అలాంటి కథ చెబితే బాగుంటుందనే ప్రయత్నమే ఇది. నీ వ్యవస్థని బాగు చేసుకునే అవకాశం నీ చేతిలోనే ఉన్నప్పుడు, అది మరిచిపోయి తిడుతూ కూర్చుంటే ఎలా? నా సినిమాలో కథానాయకుడు అదే అడుగుతాడు. అలాగని సందేశాలు చెప్పడం కోసం తీసిన సినిమా కాదు ఇది. ప్రతి ఒక్కరిలోనూ ఓ ఆలోచనని రేకెత్తిస్తుంది’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు