Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్‌ ఎంట్రీ.. బీజీఎంపై సంతోశ్‌ నారాయణన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌ నేపథ్య సంగీతంపై నెట్టింట చర్చ జరుగుతోంది.

Published : 05 Feb 2024 18:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర హీరో సినిమాలపై వారి అభిమానులతోపాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నమోదవుతాయి. ఆయా చిత్రాల అప్‌డేట్స్‌ నెట్టింట వైరల్‌గా మారతాయి. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ఈ కోవకే చెందుతుంది. ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వెలువడటమే ఆలస్యం అందరిలోను అమితాసక్తి నెలకొంది. తర్వాత వచ్చిన అప్‌డేట్స్ అదుర్స్‌ అనిపించాయి. ఇప్పుడు ప్రభాస్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌పై చర్చ జరుగుతోంది. ఎందుకంటే..?

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ (Santhosh Narayanan) ఈ సినిమాపై స్పందించారని, ప్రభాస్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ గురించి తమతో ప్రత్యేకంగా మాట్లాడారని ఓ వెబ్‌సైట్‌ పేర్కొంది. ‘‘ఈ సినిమాలోని ప్రభాస్‌ పరిచయ సన్నివేశ నేపథ్య సంగీతం మరింత బాగుండాలనే ఉద్దేశంతో మరోసారి దానిపై వర్క్‌ చేస్తున్నా. అది స్పెషల్‌గా ఉండబోతోంది. మాస్‌ అనిపిస్తుంది’’ అని చెప్పినట్లు సదరు పోర్టల్‌ వ్యాఖ్యానించింది. ఇవే కామెంట్స్‌ను పలువురు అభిమానులు ఇమేజ్‌పై రాసి షేర్‌ చేయడంతో అందరి దృష్టి నెలకొంది. ‘వావ్‌’, ‘సూపర్‌’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఈ సినిమా కోసం వినియోగించే వస్తువులను స్క్రాప్‌ నుంచి తయారుచేస్తున్నారు. దాంతో, ఇంజినీరింగ్‌ వర్క్‌కే అధిక సమయం వెచ్చించాల్సి వస్తోందని దర్శకుడు ఓ సందర్భంలో తెలిపారు. ఈ సినిమాలో కొత్త ప్రభాస్‌ను చూస్తారంటూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె (Deepika Padukone), దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది (Kalki 2898 AD Release Date).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని