Gautham Menon: గౌతమ్‌ మేనన్‌ సూపర్‌ ప్లాన్‌.. సచిన్‌ - వినోద్‌ కాంబ్లిపై సినిమా..!

 స్నేహితులు, క్రికెటర్లు సచిన్‌, వినోద్‌ కాంబ్లిను ఆధారంగా చేసుకుని తానొక సినిమా చేయనున్నట్లు దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ ప్రకటించారు.

Published : 15 Nov 2023 16:47 IST

చెన్నై: మనసుని హత్తుకునే ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించడంలో మాస్టర్‌ మైండ్‌గా దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ (Gautham Menon)కు పేరు. తన తదుపరి చిత్రం ‘ధ్రువ నక్షత్రం’ (Dhruva Natchathiram) ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారాయన. ఇందులో భాగంగా తాను చేయనున్న కొత్త ప్రాజెక్ట్‌లపై తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘క్రికెట్‌ నేపథ్యంలోనే నా తర్వాతి కథ ఉండనుంది. క్రికెట్ దిగ్గజం సచిన్‌, మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లిని స్ఫూర్తిగా తీసుకుని పాత్రలు క్రియేట్‌ చేస్తున్నా. క్రికెట్‌ అంటే అమితంగా ఇష్టపడే ఇద్దరు స్నేహితుల కథగా దీనిని తీర్చిదిద్దనున్నా’’ అని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలపై క్రికెట్‌, సినీ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు.

‘‘ధ్రువ నక్షత్రం’ కథను మొదట సూర్యకు చెప్పా. స్పై థ్రిల్లర్‌ సినిమాలు వర్కౌట్‌ అవుతాయా? లేదా? అనే సందేహం ఆయనకు వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో ఇలాంటి సినిమాలు వచ్చిన దాఖలాల్లేవు. దీంతో మా కాంబోలో ‘ధ్రువ నక్షత్రం’ కార్య రూపం దాల్చలేదు. ఆ తర్వాత ఇదే కథను కొన్ని మార్పులు చేసి రజనీకాంత్‌కు చెప్పా. ఆయనా ఓకే అన్నారు కానీ అనివార్య కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. విక్రమ్‌ హీరోగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం’’ అని గౌతమ్ తెలిపారు.

యువకుడిని కొట్టిన సీనియర్‌ నటుడు.. వీడియో వైరల్‌

విక్రమ్‌ హీరోగా గౌతమ్‌ మేనన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ధ్రువ నక్షత్రం’. స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో గౌతమ్‌ దీనిని సిద్ధం చేశారు. 2016లోనే ఈ సినిమా ప్రారంభమయింది. 2017లో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. చిత్రీకరణ పూర్తైనప్పటికీ అనుకోని కారణాలతో ఇది వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. నవంబర్‌ 24న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. రీతూవర్మ, సిమ్రన్‌, ఐశ్వర్య రాజేశ్‌, రాధిక, తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని