swayambhu: నిఖిల్‌ ‘స్వయంభూ’ చిత్రంలో నభానటేష్ లుక్‌ ఇదే

నిఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘స్వయంభూ’ చిత్రంలో నభానటేష్‌ కీలక పాత్రలో నటించనున్నారు.

Published : 04 Apr 2024 14:41 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ నటి నభానటేష్‌ (Nabha Natesh) ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. రామ్‌పోతినేని హీరోగా నటించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, ‘డిస్కో రాజా’, వంటి చిత్రాల్లో నటించిన ఆమె దాదాపు మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘స్వయంభూ’ (swayambhu) చిత్రంలో మరో నాయికగా నభా నటేష్‌ పేరుని ఖరారు చేశారని వార్తలొచ్చాయి. ఆ వార్తలు నిజమేనంటూ తాజాగా సినిమాలో ఆమె లుక్‌కి సంబంధించిన వీడియోను విడుదల చేసిన చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు భరత్‌ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. ఇందులో సంయుక్త మేనన్‌ కథానాయిక. యుద్ధ నేపథ్య కథాంశంతో రూపొందుతోన్న ఈ యాక్షన్‌ డ్రామాలో నిఖిల్‌ ఓ యోధుడి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇందుకోసం ఆయన మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీ తదితర విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్‌, శ్రీకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతమందిస్తుండగా.. మనోజ్‌ పరమహంస ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని