Nag Ashwin: బర్త్‌డే వేడుకల్లో నాగ్‌ అశ్విన్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 24 Apr 2024 16:08 IST

హైదరాబాద్‌: ‘కల్కి 2898 ఏడీ’తో సినీ ప్రియులకు విభిన్నమైన సినిమాటిక్‌ అనుభూతిని పంచేందుకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సిద్ధమవుతున్నారు. మంగళవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందానికి ఆయన స్పెషల్‌ పార్టీ ఇచ్చారు. హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం జరిగిన ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో ఆయన టీమ్‌తో కలిసి ‘మాస్‌’ టైటిల్‌ సాంగ్‌కు స్టెప్పులేశారు. అనంతరం, తన సతీమణి ప్రియాంకతో కలిసి ‘‘వయ్యారి భామ... నీ హంస నడక’’ పాటకు డ్యాన్స్‌ చేశారు.

ప్రభాస్‌ హీరోగా నాగ్‌అశ్విన్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రమే ‘కల్కి 2898ఏడీ’. ఇతిహాసాలతో ముడిపడిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా ఇది సిద్ధమవుతోంది. దీపికా పదుకొణె హీరోయిన్‌ (Deepika Padukone).  ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ కనిపించనున్నారు. ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌, నటి దిశాపటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనిని మే 9న విడుదల చేయాలని చిత్రబృందం తొలుత భావించింది. ఈ మేరకు ప్రకటన కూడా చేసింది. కానీ, సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కొత్త రిలీజ్‌ డేట్‌ను త్వరలో ప్రకటిస్తారని టాక్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని