kalki: మహాభారతం నుంచి మొదలై..

‘కల్కి 2898 ఏడీ’ కథకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. 6 వేల సంవత్సరాల మధ్య జరిగే కథతో సినిమాని తెరకెక్కిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Updated : 27 Feb 2024 09:27 IST

‘కల్కి 2898 ఏడీ’ కథకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. 6 వేల సంవత్సరాల మధ్య జరిగే కథతో సినిమాని తెరకెక్కిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రభాస్‌ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపికా పదుకొణె తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చివరి దశ చిత్రీకరణ పనుల్లో ఉందీ చిత్రం. మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్ర కథ గురించి చెప్పారు. ‘‘మహాభారతంతో మొదలై.. క్రీస్తు శకం 2898లో పూర్తయ్యే కథ ఇది. మొత్తం 6 వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా ఆయా ప్రపంచాల్ని సృష్టించడానికి ప్రయత్నించాం. ఆ ప్రపంచాలు కూడా భారతీయతని ప్రతిబింబించేలా ఊహించుకుంటూ మలిచాం. హాలీవుడ్‌లో విడుదలైన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘బ్లేడ్‌ రన్నర్‌’ పోలికలు ఇందులో కనిపించనీయలేదు. అది మాకు పెద్ద సవాల్‌గా మారింది. క్రీస్తు శకం 2898కి ఆరు వేల ఏళ్ల ముందు క్రీస్తు పూర్వం 3102 కాలం ఉంది. ఆ సమయాన్ని కృష్ణుడి చివరి అవతారం అని నమ్ముతారు. సినిమాకి ఈ పేరు పెట్టడానికి కారణం కూడా అదే’’ అని చెప్పారు నాగ్‌ అశ్విన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని