Naga Babu: నన్ను క్షమించండి.. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా: నాగబాబు

సోషల్‌ మీడియా వేదికగా నటుడు నాగబాబు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ నోట్‌ను విడుదల చేశారు.

Updated : 29 Feb 2024 14:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల జరిగిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine) ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు నటుడు నాగబాబు (Naga Babu) తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా క్షమాపణలు చెబుతూ నోట్‌ విడుదల చేశారు.

‘పోలీస్‌ పాత్ర 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది. 5 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుండదు అని ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాను. ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ఎవరైనా వాటికి నొచ్చుకొని ఉంటే క్షమించండి. అవి యాదృచ్ఛికంగా వచ్చినవే కానీ.. కావాలని అన్న మాటలు కాదు. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు. మరోవైపు నాగబాబు వ్యాఖ్యలపై వరుణ్‌తేజ్‌ కూడా స్పందించారు. ఎత్తుకు సంబంధించి తన తండ్రి చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి కాదన్నారు. తన హైట్‌ను దృష్టిలో పెట్టుకొని చిన్న పోలిక చేశారని.. ఏ హీరోను కించపరిచే ఉద్దేశం లేదన్నారు.

హాలీవుడ్‌కు ‘దృశ్యం’.. తొలి భారతీయ చిత్రంగా రికార్డు

శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా నటించిన చిత్రమే ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). 2019లో జరిగిన పుల్వామా దాడి ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందింది. భారత వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను ఇందులో చూపించనున్నారు. మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) హీరోయిన్‌. మార్చి 1న  తెలుగు, హిందీలో విడుదల కానుంది.రుహానీ శర్మ, నవదీప్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని